ముంబయిలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలోని సీరియల్ సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షూటింగ్ జరుగుతున్న 2 వేల చదరపు అడుగులు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ స్టూడియోలో మంటలు చెలరేగాయి. భారీగా మంటల ధాటికి చుట్టపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు . కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ముంబయి గోరేగావ్ ఫిల్మ్ సిటీలో “గమ్ హై కిసికే ప్యార్ మే” అనే టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోండగా శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం జరిగింది.