Mother suicide | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఆంజనేయపురంలో విషాదం నెలకొంది. కన్న కొడుకుపై బెంగ పెట్టుకున్న ఓ మాతృమూర్తి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల పెళ్ళైన కొడుకు అత్తగారింట్లో కాపురం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి.. కన్న కొడుకు దూరమయ్యాడని బెంగతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.