Myanmar | మయన్మార్ ను భీకర దాడులు అతలాకుతలం చేశాయి. దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసన ర్యాలీ చెప్పట్టారు. దీంతో ఆ ప్రజలపై సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మంది పౌరులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాన్బలు పట్టణం పాజిగ్యీ గ్రామ శివారులో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వ వ్యతిరేక బృందాల వ్యక్తులు, స్థానికులు వచ్చారు. అక్కడకి చేరుకున్న వీరు నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక బృందాలపై విమానం, హెలికాప్టర్ తో సైన్యం దాడులు చేసింది.