AP News |అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు విజయవాడ ప్రజాప్రతినిధుల విచారణ చేసే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తనపై చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం కేసు వేశారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే ఈ కేసులో వాయిదాలకు హాజరు కాకపోవడంతో… కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అనంతపురం టూ టౌన్ పీఎస్, గోరంట్ల పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ వారెంట్లను రెఫర్ చేసింది.