Punjab |ఈ మధ్య కాలంలో విమానాల్లో మూత్ర విసర్జన ఘటనలు తరుచూ వింటూనే ఉన్నాం. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం కూడా రేపాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రైలులో జరిగింది. పంజాబ్ అమృత్‌సర్ కు చెందిన ఓ మహిళ కుటుంబంతో కలిసి అమృత్‌సర్-కోలకతా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో అర్థరాత్రి నిద్రిస్తున్న ఆ మహిళపై టీసీ(TC) మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఒక్కసారిగా మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు గుమిగూడారు. తనపై మూత్ర విసర్జన చేసినట్లు ప్రయాణికులకు చెప్పడంతో వారంతా టీసీ(TC)ని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మున్నా కుమార్ గా గుర్తించారు. ఒక రైల్వే అధికారే మద్యం మత్తులో ఇలా చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Also: హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం
Follow us on: Youtube Instagram