ఇవాళ మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. లగచర్ల ఘటనపై బీఆర్‌ఎస్ ఆందోళనలతో శాసనసభ దద్దరిల్లింది. ఈ ఆందోళనల నడుమే పలు బిల్లులకు ఆమోదం తెలిపింది శాసనసభ. స్పోర్ట్ పాలసి, GST సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.
లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష నేతలు. రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుబట్టారు. దీంతో బీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క. బీఆర్‌ఎస్ హయాంలో ఎంతో మంది రైతులకు బేడీలు వేశారని ఆరోపించిన సీతక్క.. రూల్ బుక్‌ను ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యారు.