మారుతి సుజికి ఇండియా డాజ్లింగ్ డిజైర్ సరికొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది. నగరంలో ని ఎల్.బి.నగర్ లో గల మారుతి సుజికి ఎరినా కళ్యాణి మోటర్స్ లో ఈ డాజ్లింగ్ డిజైర్ ను జబర్దస్త్ వర్ష ఆవిష్కరించారు. వర్ష తో పాటు కళ్యాణి మోటార్స్ సిఇఓ వేంకటేశ్వరరావు, బ్రాంచీ ఏజియం రాజ్ కుమార్ తదితరులు కలిసి ఈ కొత్త మోడల్ ను ఆవిష్కరించి.
ఈ సందర్భంగా వర్ష మాట్లాడుతూ.. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ కి ఎంతో కంఫోర్ట్ కారు అని, లగ్జరీ ఫీచర్స్ తో ఈ కారు ఎన్నో సౌకర్యాలతో డిజైన్ చేసిందన్నారు. మారుతీ కార్లు బెస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ కార్లుగా నిలుస్తాయన్నారు.
కళ్యాణి మోటర్స్ ద్వారా డాజ్లింగ్ డిజైర్ కొత్త మోడల్ ట్రెండ్ సెట్టింగ్ వర్చువల్ అనుభూతిని అందిస్తుందని, బుకింగ్‌లకు వినియోగదారుల నండి మంచి స్పందన వస్తుందని కళ్యాణి మోటార్స్ సిఇఓ వేంకటేశ్వరరావు పేర్కొన్నారు. సాంకేతిక, ట్రెండ్ కు అనుగుణంగా రూపొందించబడిన డాజ్లింగ్ డిజైర్ సరి కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని, కొత్త డిజైర్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందిందని, ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్ లు, మైలేజ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 24.79 kmpl, CNGలో 33.73 kmpl మరియు AGSలో 25.71 kmpl ఇస్తుందని వివరించారు.