దీపావళి వేడుకలో జాగ్రత్తలు పాటించకుండా గాయాలపాలైన బాధితులు ఆస్పత్రులకు క్యూకట్టారు. కంటికి గాయంకావడంతో ఎక్కువ మంది బాధితులు సరోజిని కంటి ఆస్పత్రికి పరుగులు తీశారు. ఇప్పటి వరకూ 38 మందికి చికిత్స అందించగా… అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే,.. మేజర్ కేసులు రాలేదని తెలిపారు ఆస్పత్రి సిబ్బంది.
దేశవ్యాప్తంగా ఊరు-వాడలా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. క్రాకర్స్ కాంతులు, ప్రమిదల వెలుగులతో ఎటు చూసినా దీవాళి శోభ సంతరింకుంది. అర్థరాత్రి వరకూ బాంబుల మోత మోగిపోయంది. అయితే,.. ఈ వేడుకలో కొందరు అజాగ్రత్తగా టపాసులు కాల్పడంతో గాయాలపాలయ్యారు. దీంతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు.