హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు నిర్వాసితుల ఇళ్లను మార్కింగ్ చేస్తున్నాయి. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయమని కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్ వాసులు తేల్చి చెప్పారు. సర్వే నిర్వహిస్తున్న పత్రాలను చించివేసి, గోడలకు పెయింట్ వేయనివ్వకుండా అడ్డుకున్నారు.
ఇక హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురా నియోజకవర్గంలో మూసి నది రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు తీసుకొని రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని పలు ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తున్నారు. దాదాపు 386 ఇండ్లు మూసి రివర్ బేడీలోకి వస్తున్నాయని తెలిపారు. రివర్ బెడ్ లో వచ్చే అన్ని ఇండ్లలో ఉంటున్న మొత్తం 386 ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారు. బహదూర్‌పురా పోలీసులు ఎలాంటి అవంచనియా జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.