రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై రివ్యూ చేపట్టారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో 290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని సీఎం కోరారు.