25.2 C
Hyderabad
Monday, December 2, 2024
spot_img

‘ధూం ధాం’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది: చేతన్ కృష్ణ

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా సకుటుంబంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

గోపీ మోహన్ మాట్లాడుతూ – మా “ధూం ధాం” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంచి సినిమా చేశామని ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను మీడియా మిత్రులు మరింతగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. థియేటర్స్ కు వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.

దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే పేరు వస్తోంది. ఈ సినిమాకు పనిచేసే అవకాశం మా గోపీ మోహన్ గారి వల్ల వచ్చింది. “ధూం ధాం” సినిమా రిలీజైన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాకు కనీసం వంద ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బెనర్జీ, సాయి శ్రీనివాస్ వంటి వారి క్యారెక్టర్స్ చూస్తూ ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు. మా మూవీని మీడియా ఫ్రెండ్స్ మరింతగా ఆడియెన్స్ కు రీచ్ చేయాలి. అన్నారు.

నటుడు గిరిధర్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమాలో నా క్యారెక్టర్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సాయికిషోర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. నా క్యారెక్టర్ బాగుందంటూ ఎంతోమంది ఫోన్ చేసి చెబుతుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

నిర్మాత రామ్ కుమార్ మాట్లాడుతూ – పెద్ద సినిమాల పోటీలో “ధూం ధాం” లాంటి చిన్న సినిమా నిలదొక్కుకోవడమే గొప్ప విషయం. మేము ఇంకా పరుగు స్టార్ట్ చేయలేదు. నిలబడ్డాం అంతే. మా మూవీని ఆడియెన్స్ దాకా రీచ్ చేసిన క్రెడిట్ మీడియా మిత్రులదే. తర్వాత ఓటీటీలో చూద్దాంలే అని అనుకోకుండా “ధూం ధాం” సినిమాను థియేటర్ లో ఎక్సిపీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను 2, 3 వందల మంది ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ – మా “ధూం ధాం” సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తోంది. మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. నిన్న (ఫ్రైడే) మార్నింగ్ నుంచి రాత్రి వరకు ప్రతి షోకు థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ పెరిగాయి. సినిమా చాలా బాగుందంటే తప్ప ఆడియెన్స్ బయటకు రాని ఈ ట్రెండ్ లో మా మూవీకి 70, 80 పర్సెంట్ హౌస్ ఫుల్స్ కావడం సంతోషంగా ఉంది. సినిమాలో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని మేము ముందునుంచీ చెబుతూ వస్తున్నాం. ఆ ఎంటర్ టైన్ మెంట్ కే ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసి తమ రెస్పాన్స్ చెబుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. చూడని వాళ్లు థియేటర్స్ లో “ధూం ధాం” చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా

Latest Articles

ఇక నుంచి మీ కోసం.. మీ వెంటే.. మీ జగన్‌

సంక్రాంతి తర్వాత క్యాడర్‌తోనే తానంటున్న జగన్.. ఎందుకంటే? ఇప్పటికైనా బాస్‌ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు. ఇక నుంచి మీకోసం.. మీ వెంటే.. మీ జగన్‌ అన్న.. అంటూ కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్