వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు.
వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3గంటల 25నిమిషాలకు చేరుకుంటారు. 4 గంటలకు విమానంలో బయలుదేరి 5గంటల 40నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6గంటల 25నిమిషాలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. రేపు గుంటూరు వెళ్లి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శిస్తారు. నందిగం సురేశ్‌ను ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది.