19.7 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

జైల్లో నందిగం సురేష్‌ను పరామర్శించనున్న జగన్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు.

వైఎస్‌ జగన్‌ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3గంటల 25నిమిషాలకు చేరుకుంటారు. 4 గంటలకు విమానంలో బయలుదేరి 5గంటల 40నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6గంటల 25నిమిషాలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. రేపు గుంటూరు వెళ్లి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శిస్తారు. నందిగం సురేశ్‌ను ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్