అ … అంటే అమ్మ…! మనందరికీ అమ్మ మన జీవితంలో ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే ! అటువంటి అమ్మ ఒక్కసారిగా దూరమైపోతే? వినడానికే చాలా కష్టంగా ఉంది కదా! మన కావ్య కూడా అంతేనండి! తన అమ్మ ఎందుకు దూరం అయిందో తెలియక, ఎక్కడుందో తెలుసుకోవాలని పడే తాపత్రయంలో…… చివరికి అమ్మను చేరుకుందా ! చేరుకునే క్రమంలో తనకి ఎదురైనా ఒడిదుడుకులని ఎలా ఎదుర్కుందో చూడాలంటే.. జెమినీ టీవీలో సరికొత్త సీరియల్ అమ్మకు ప్రేమతో…. ! రాబోతుంది. ఆగస్ట్ 19 నుండి ప్రారంభం కానుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12.౩౦ గంటలకు ….తిరిగి రాత్రి 9. ౩౦ గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సీరియల్ లాగే దీన్ని కూడా ఆదరించాలని కోరారు.