వైసీపీ అధినేత జగన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం అవాస్తవమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే.. కానీ ఇసుక అక్రమం చేశామని దుష్ప్రచారం చేయటం తగదన్నారు.. ఉచిత ఇసుక అంటూనే టన్నుకు కొంత మొత్తం వసూలు చేస్తున్నారన్నారు వైవీ సుబ్బారెడ్డి.