రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురెదురు పడడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కకు తప్పిం చారు.