కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కార్యకర్తతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అమలు కాని హామీలిచ్చి విఫలమయ్యారని విమర్శించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.