ఎన్నికలకు సమయం ఆసన్నంకావడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేరు కుని.. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇక షా పర్యటన సందర్భంగా కట్టుది ట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


