లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చాక కల్యాణ లక్ష్మీ పేరిట తులం బంగారం ఏమోగానీ, లక్ష రూపాయాలు కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు 4 వేల పెన్షన్ వస్తుందని ఆశపడి కాంగ్రెస్‌ను నమ్మితే ఓటు వేస్తే కనీసం రెండు వేల రూపాయలు కూడా రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యా యన్న ఆయన, 120 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని దుయ్యబట్టారు.