ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఐఆర్ చేసి.. అతని ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన బడంగపేట్‌లో చోటుచేసుకుంది. బడంగపేట్ లో నివాసం ఉంటున్న జగన్ అనే వ్యక్తి.. తాను ఊరివేసుకొని చచ్చిపోతున్నానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నైట్ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్స్ నారాయణ, నర్సింహాలు వెంటనే జగన్ ఇంటికి చేరుకున్నారు. సీలింగ్ కు హ్యాంగ్ చేసుకుని కోన ఊపిరితో వేలాడుతున్న జగన్ ను పోలీసులు కిందకు దించారు. వెంటనే సీపీఐ ఆర్ చేసి.. జగన్ ప్రాణాలను కాపాడారు. స్పృహలోకి వచ్చిన తర్వాత మెరుగుయైన వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. దీంతో జగన్ భార్య, కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ కలహాలతోనే బాధితుడు ఆత్మ హత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.


