24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

జాతర ఉత్సవం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లక్ష్మీ వెంకటేశ్వరస్వామి జాతర ఉత్సవం కన్నులపండువగా సాగింది. శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశేషంగా భక్తులు ఈ ఉత్సవంకు తరలిరాగా చెంచుల ఆటపాటలు పలువుర్ని ఆకట్టుకున్నాయి. తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

హుండీ లెక్కింపు

కడప జిల్లా సిద్ధవటం మండలం వంతాటి పల్లె గ్రామపంచాయతీ లంక మల్ల అభయారణ్యంలో వెలసిన నిత్యపూజేశ్వర కోన ఆలయ హుండీని లెక్కించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హుండీ ఆదాయం 9 లక్షల 96 వేల 750 రూపాయలు వచ్చినట్లు ఎండోమెంట్‌ సూపరింటెండెంట్‌ రాంప్రసాద్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొండారెడ్డి తెలిపారు.

పార్టీ నిర్ణయమే శిరోధార్యం

పార్టీ అధిష్టానం నిర్ణయానికి ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. సైకిల్‌ గుర్తు లేకుండా తొలిసారి ఎన్నికలకు వెళ్తున్నామన్న ఆమె జనసేన అభ్యర్ధి గెలుపుకు కృషి చేయా లని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత ఆదేశాలు, పార్టీ సిద్దాంతాలే తమకు ముఖ్యమన్నారు సుగుణమ్మ.

వైసీపీతోనే రాజ్యాధికారం

సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందన్నారు బిజీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. తూర్పుగోదావరి జిల్లా కానూరులో ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో జరిగిన నిడదవోలు నియోజకవర్గ బీసీ ఆత్మీయ సమ్మేళానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అగ్ర వర్ణా లతో సమానంగా బడుగులు ఎదగాలన్న జ్యోతిరావుపూలే, అంబేద్కర్‌ కలలను సీఎం జగన సాకారం చేశారన్నారు పలువురు నేతలు.

ముస్లింల ఆత్మీయ సమావేశం

టీడీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.మాధవి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ శాసనమండలి సభ్యులు షరీఫ్ మాట్లాడుతూ…వైసీపీ పాలనలో ముస్లింలకు జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. ముస్లింలపై దాడులు సైతం పెరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ కి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.

అధికారుల అత్యుత్సాహం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్ధానం అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. లింగోద్భవకాల దర్శనాన్ని తిలకిద్దామని వచ్చిన భక్తుల్ని నిరాశ పర్చారు. రాజకీయ, అధికారుల సేవలో తరించారు. పాలకవర్గ, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈవో డౌన్ -డౌన్ అంటూ నినాదాలు చేసారు. సామాన్య భక్తులకు స్వామిని దూరం చేసేలా వ్యవహరం ఉందంటూ మండిపడ్డారు.

వాట్సాప్‌ ద్వారా మెట్రో టిక్కెట్స్‌

వినియోగదారుల కోసం వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్‌ టికెట్స్‌ను వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. URL ద్వారా టిక్కెట్‌ను డౌన్లోడ్‌ చేసుకున్న ప్రయాణీకులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా ట్రైన్స్‌లో ప్రయాణించవచ్చు. ఇలా జనరేట్‌ అయిన టిక్కెట్‌ను 24 గంటలలోపు వినియోగించుకోవాల్సి ఉంటోంది.

క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌

వైయస్సార్ జిల్లా కాజీపేట, ఏటూరు పాపాగ్ని నది బ్రిడ్జి ఫై రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గు లారీ ఇసుక ట్రాక్టర్ ను ఢీ కొనడంతో లారీ డ్రైవర్ గెల్లెల ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్ లో ఇరుక్కుని నానా యాతన పడ్డ లారీ డ్రైవర్‌ను జెసీబీ సహాయంతో బైటకు తీసి చికిత్సకై కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రైన్‌ ఢీ – గొర్రెలు కాపరి మృతి

హనుమకొండ జిల్లా న్యూశాయంపేట గ్రామం రైల్వే ట్రాక్‌ వద్ద ప్రమాదం జరిగింది. రైల్వే గేటు దాటుతున్న గొర్రెల మందను శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొనడంతో వందకుపైగా గొర్రెలు మృత్యువాతపడ్డాయి. గొర్రెలను కాపాడుకునే త్నంలో గొర్రెల కాపరి సల్ల పోశాలు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్‌

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ – WPL సీజన్‌ 2 లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయంట్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ అర్హత దక్కించుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది.

కమల్‌ రూ. కోటి విరాళం

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నూతన భనవ నిర్మాణంకై ప్రముఖ నటుడు కమలహాసన్ కోటి రూపాయలను విరాళంగా అందజేసాడు. సుమారు 40 కోట్లతో చేపడుతున్న ఈ భవనం నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా మిగిలింది. ఈ క్రమంలో కోటి రూపాయల చెక్కును సంఘం ట్రైజరర్‌ హీరో కార్తీక్ కి అందజేసారు కమల్‌హాసన్‌. 

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్