38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

గొర్రెల స్కామ్‌లో తెరపైకి రోజుకో అంశం

     తెలంగాణలో గొర్రెల స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే మరో ఇద్దరి వెటర్నరీ ఉన్నతాధికారుల పాత్ర బయటపడుతోంది. దీంతో గొర్రెల స్కాములో ఉన్నతాధి కారుల పాత్ర, కదలికలపై ఏసీబీ దృష్టి సారించి పలు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

      తెలంగాణ పశుసంవర్ధక శాఖలో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారానికి సంబంధించి రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వీపూరులో గొర్రెల సరఫరాదారులకు ఇవ్వాల్సిన సొమ్ము పక్కదారి పట్టడంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆవుల సరఫరాలో ఇప్పటికే భారీ మోసం భయటపడింది. ప్రస్తుతం మరో విషయం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గొర్రెల సరఫరాదారులకు చెల్లింపుల విషయంలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాల్లో పడాల్సిన 2కోట్ల 10లక్షల రూపాయలు మొన్నటిదాకా బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు.

     ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నలుగురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కస్టడీకి కోరగా నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఎనిమిది రోజుల కస్టడీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. నలుగురు నిందితుల కాన్ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. దాని ఆధారంగా రంగారెడ్డి జిల్లాలోని కొంత మంది వెటర్నరీ ఉన్నతాధికారులు, జేడీ, ఏడీలను విచారించింది. అదే కాకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాలోని వెటర్నరీ వైద్యులను విచారించినట్లు తెలుస్తోంది. గొర్రెల స్కీములో లోలోన కంపెనీ పాత్ర, బినామీ ఖాతాల్లోకి డబ్బుల మళ్లింపు, ఇంత అవినీతి జరుగుతుంటే అధికారులు ఎందుకు అక్షయ పాత్ర వహించారు..! ఎవరైనా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా…? లేక గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ చెప్పారా..! ఇలా చాలా రకాల ప్రశ్నలను ఏసీబీ అధికారులు నివృత్తి చేసుకున్నారు. దీంతో దీని వెనుక ఉన్న అధికారుల చిట్టా మెల్లమెల్లగా బయటపడుతోంది.

     గొర్రెల స్కాములో ఏసీబీ దర్యాప్తు క్రమంలో ఇప్పటికే మరో వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ అక్రమాల చిట్టాపై ఏసీబీ ఆధారాల సేకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఏడీ స్థాయి అధికారి పాత్రపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి సంబంధించిన గొర్ల కాపరులకు గొర్రెల పంపిణీ కోసం పశుసంవర్ధక శాఖ ఏడీ ఒకరు..గతంలో నెల్లూరు జిల్లా సరఫరాదారుల్ని సంప్రదించారు. ఒప్పందం ప్రకారం 28 యూనిట్ల గొర్రెల సరఫరా పూర్తయింది. 12 యూనిట్లకు సంబంధించిన సొమ్మును ఏడీ స్థాయి అధికారే తన బినామీల ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడీ చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేయగా..50వేల రూపాయలు ఇస్తే పనవుతుందని చెప్పడంతో ఆ డబ్బును సైతం ముట్టజెప్పారు. ఆ ఏడీ తన బినామీ ఫోన్‌పే నంబరుకు 30 వేలతోపాటు కుమార్తె ఫోన్‌ నంబరుకు 20 వేలు జమ చేయించుకున్నట్లు గుర్తించారు. లంచం ఇచ్చినా పని జరగకపోవడంతో తాజాగా బాధితులు ఉన్నతాధికారులకు, ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏడీ, జేడీల చేతివాటం వెలుగులోకి వచ్చింది. మరోవైపు గొర్రెల పంపిణీ పథకం గోల్‌మాల్‌పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకోవైపు అతడికి గత ప్రభుత్వ హయంలో ఒకరిద్దరు కీలక ప్రజాప్రతినిధులైన మాజీ మంత్రులు దగ్గర సంబంధాలున్నట్లు బాధితులిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుంభ కోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ కూడా రంగంలోకి దిగే అవకాశాలుండటంతో నిధుల మళ్లింపు వ్యవహారానికి ఇంకా ప్రాధాన్యత సంతరించుకొంది.

Latest Articles

నేటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు

   బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్య ర్థుల నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్