బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమవ్యవ హారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం డోవూరు గ్రామానికి చెందిన శిరీష నిన్ననే ఇంటి నుంచి బాసర క్యాంపస్‌కు వచ్చింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో క్యాంపస్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. శిరీష గదిలో సూసైడ్ నోట్‌ను గుర్తించారు పోలీసులు. తన బావ లేకుండా తాను ఉండలేకపోతున్నానంటూ సూసైడ్ లెటర్‌లో రాసినట్లు తెలుస్తోంది.