స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతి రైతులు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకుకే జగన్ ప్రభుత్వం ఆర్-5 జోన్ అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పేదవాళ్లను మోసగించడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు CRDA విధివిధానాల్లో భాగంగా అమరావతిలో 5శాతం భూమిని పేదల కోసం కేటాయించామని తెలిపారు. కానీ వైసీపీ సర్కార్ ఆర్-5 జోన్ తెచ్చి ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని పేర్కొన్నారు. పేదలను మోసం చేయడమే కాకుండా రైతులకూ అన్యాయం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


