24.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

9 రోజులైనా… ఇంకా సొరంగ మార్గంలోనే కార్మికులు

ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ నుంచి యమునోత్రి వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా కొండల్లో సాగే మార్గం. కొండను తొలిచి ఏర్పాటు చేసిన మార్గంలో ప్రయాణం రిస్క్, వ్యయ ప్రయాసలతో కూడిన మార్గం.. రైల్ సౌకర్యం లేకపోవడంతో ట్రక్కులు, కార్ల ద్వారా ప్రయాణం తప్పదు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేలోని సిల్ క్యారా – బార్కోట్2లను కలుపుతూ.. సొరంగ మార్గం నిర్మిస్తే.. ప్రయాణ దూరం తగ్గించవచ్చనే ఉద్దేశంతో సిల్ క్యారా వద్ద నుంచి కొండను తొలిచి సొరంగ మార్గం నిర్మిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం మధ్యలో కొంత భాగం కుప్పకూలడంతో దాదాపు 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు.

దేశంలో హిందువులంతా.. జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునేది యాత్ర ..చార్ థామ్ యాత్ర.. యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్, కేదార్ నాథ్ లను కలుపుతూ ఉత్తరకాశీ, హరిద్వార్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్ లమీదుగా సాగే యాత్ర అది. వ్యయ ప్రయాసలతో కూడిన ఈ యాత్ర కష్టమైనా భగవద్భక్తులు ఇష్టంగా చేస్తారు. ఆయా కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, ప్రయాణ దూరం తగ్గించేందుకు నరేంద్రమోదీ సర్కార్ చేపట్టిన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగమే.. ఉత్తరకాశీ – యమునోత్రి జాతీయ మార్గంలో చేపట్టిన సొరంగ మార్గ నిర్మాణం.

ఉత్తర కాశీలోని కొండ ప్రాంతంలో బార్కోట్ – సిల్ క్యారా మధ్య ఓ కొండను తొలిచి ఈ సొరంగ మార్గం నిర్మిచే బృహత్తర కార్యక్రమాన్ని నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులతో ఈ టెన్నెల్ నిర్మాణం పని చేపట్టారు. రాడి పాస్ ద్వారా యమునోత్రి – గంగోత్రిని కలుపుతూ సొరంగమార్గం తలపెట్టారు. 4, 531 మీటర్ల సొరంగాన్ని 853 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. ఒక పక్క సిల్ క్యారా ప్రాంతంలో టెన్నెల్ తవ్వకం జరుపుతూనే.. మరో పక్క బార్కోట్ వైపు నుంచి కూడా టెన్నెల్ తవ్వకం ప్రారంభించారు.

నవంబర్ 12న ఆదివారం యమునోత్రి నేషనల్ హైవే లో సిల్ క్యారా ప్రాంతం నుంచి తవ్వుతున్న సొరంగ మార్గం మధ్యలో కుప్పకూలింది. తెల్లవారు జామున 5.30 గంటలకు జరిగిన ప్రమాదంలో దాదాపు 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకు పోయారు. నాటి నుంచి 8,9 రోజులుగా నిర్విరామంగా శిథిలాలను తొలగించి, కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో పాటు స్థానిక కూలీలు శ్రమిస్తున్నారు. శిథిలాల్లో భారీ బండరాళ్లు ఉండడం, వాటి డ్రిల్లింగ్ కోసం అత్యాధునిక యంత్రాలను రప్పిస్తున్నారు. ఒకపక్క శిథిలాలు తొలగిస్తున్నా.. మరో పక్క మరి కొన్ని చోట్ల బండరాళ్లు విరిగి పడడంతో సహాయకార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. ఇంటర్నేషనల్ టన్నెల్లింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ను సంప్రదిస్తున్నారు.

ముందుగా తీసుకున్న జాగ్రత్త వల్ల , సొరంగ మార్గంలో కార్మికులకు ఆక్సిజన్ అందేటట్లు ఏర్పాటు చేసిన పైప్ లైన్ వల్ల ప్రమాదం జరిగిన నాటి నుంచి కార్మికులకు ఆక్సిజన్, ఆహారం, నీరు, మందులు కల్పిస్తున్నారు. కానీ, 9 రోజులైనా ఇప్పటికీ .. శిథిలాల తొలగింపు పూర్తి కాలేదు. సొరంగ మార్గంలో చిక్కుకు పోయిన కార్మికులు సజీవంగా ఉండడం కొంత ఊరట కల్గించే విషయం. ఒడిషా కు చెందిన లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ ఆచార్య ప్రమాదస్థలానికి వచ్చి, ఒడిషా కార్మికులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వారందరినీ రక్షిస్తామని భరోసా కల్పించారు. ఒక పక్క శిథిలాలను తొలగించే కార్యక్రమం చేపడుతూనే, సొరంగ మార్గానికి మరో పక్క నుంచి తొలగొంచి.. కార్మికులను రక్షించే అవకాశం పై నిపుణులను రప్పించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఫోన్ లో మాట్లాడి సహాయకార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. కాగా సొరంగంలో చిక్కుకు పోయిన కార్మికులను రక్షిస్తామని, ఆ కార్మికుల కుటుంబాలకు సీఎం హామీ ఇస్తున్నారు. శిథిలాలు తొలగింపు 90 శాతం పూర్తయితే తప్ప కార్మికులందరినీ రక్షించడం కష్టసాధ్యమే.

Latest Articles

ఏక మాటపై అధికార, ప్రతిపక్షాలా.. ఎంత మంచి పరిణామం

ఎంత మంచి పరిణామం. కలవని రైలు పట్టాల్లా, నింగి నేలలా, నీరు, నిప్పులా ఉండే మూడు పార్టీలవారు, అధికార పార్టీతో సహా అందరూ ఏకమాటపై నిలిచి, ఏక బాటలో వెళ్లడం అంటే..ఏమిటో ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్