ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండడంతో శుక్రవారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి కార్మికులు సుమారు 57 మంది చిక్కుకుపోయయారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. హిమపాతం విరిగిపడి 57 మంది కార్మికులు మానా గ్రామంలో సమాధి అయినట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది కార్మికులను సహాయక బృందాలు రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన బద్రీనాథ్ ధామ్‌కు 3 కి.మీ దూరంలో జరిగింది.
ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ, బీఆర్ఓ బృందాలు ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి వరకు అతి భారీ వర్షాలు (20 సెం.మీ. వరకు) కురుస్తాయని అంచనా వేసింది.
భారీ వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. స్థానిక రోడ్లపై వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోతుందని IMD అంచనా వేసింది. భారీ వర్షాల కారణంగా విజన్ లేకపోవడం.. ట్రాఫిక్ అంతరాయం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు, పలు చోట్ల రోడ్లకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేశారు.