మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను ఓయూ విద్యార్థి నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడంపై రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భీమ్ రావు నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.