సోషల్ మీడియా దిగ్గజం మెటాకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. 2024 భారత సార్వత్రిక ఎన్నికలపై మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై సమన్లు ఇవ్వనున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో మెటాకు సమన్లు ఇస్తున్నట్లు బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దూబే తెలిపారు.
జనవరి 10న జరిగిన పోడ్‌కాస్ట్‌లో, 40 ఏళ్ల ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసిందని అన్నారు. ఈ విషయంలో భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకుని తప్పుగా చెప్పారు. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అయితే జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
ప్రజాస్వామ్యం దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. తప్పుగా మాట్లాడిన జుకర్ బర్గ్ దేశానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని నిషికాంత్ దూబే అన్నారు. అంటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా కౌంటరిచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి ఓట్లు వేసి మూడోసారి గెలిపించారని అన్నారు,.