తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే వాళ్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్టు ఆగ్రహంగా చెప్పారు. సీబీఐ, ఈడీ, బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వారికి ఉన్న అధికారాలు, ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కవిత పై చర్యలు తీసుకుంటారని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న బండి.. గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని అన్నారు. గతంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంపముంచారని, ఇప్పుడు మళ్లీ అదే మాట అంటున్నారని మండిపడ్డారు.