హరిహర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ ఇప్పట్లో జాయిన్ అవుతారా?.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కొత్త షెడ్యూల్ మొదలవగానే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని జనసేన వర్గాలు ప్రకటించాయి.
అనంతరం పవన్ కోలుకుని చకచకా లేచికూర్చున్నారు. ఏకంగా దక్షిణ భారతంలో పుణ్య క్షేత్రాలను చుట్టేశారు. షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర పూర్తి చేశారు కూడా. ఉత్సాహంగా నడుస్తూ ఆలయాల్లో పూజలు చేస్తూ అన్నీ కవర్ చేశారు. ఇక ఏపీకి రావడంతోనే తమన్ మ్యూజికల్ నైట్‌కు కూడా హాజరయ్యారు.
ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. మరి ఇప్పుడయినా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటారా..? అంటే అదీ అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరుకాకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ దగ్గర రెండే ఆప్షన్లు ఉన్నాయి.
ఒకటి .. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు.. ఈ నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొనడం. రెండోది.. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక సెట్స్ పైకి వెళ్లడం. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న అవకాశాలు ఇవే. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత షూటింగ్‌కు వెళ్తే.. అనుకున్న ప్రకారం సినిమాను మార్చి 28కి విడుదల చేయడం కష్టం కావొచ్చు.