ప్రధాని నరేంద్ర మోదీ .. బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రపంచలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్ చేరుకున్న మోదీ.. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. ఆయన వెంట ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
అంతకుముందు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రధాని అమృత స్నానం ఆచరించారు. బోటులో ఆయన వెంట సీఎం యోగి కూడా ప్రయాణించారు.