వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఏడునెలల చిన్నారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన తస్లీమ్‌కు వరంగల్ శంభునిపేటకు చెందిన తన్వీర్‌తో 20నె లల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో వరకట్నంగా లక్షా 50వేల నగదు, 26తులాల వెండి పెట్టారు. అదనం గా షాది ముబారక్‌కు వచ్చిన నగదు బైక్ కొనడానికి ఇచ్చారు. వాహనం కొనడానికి అదనంగా 26వేలు కావాలని తన్వీర్ తరచూ వేధింపులకు గురి చేసేవాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఏడు నెలల చిన్నారి తో సహా అన్నారం దర్గా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. భర్త తన్వీర్‌తో సహా ఏడుగురుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.