అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని… జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు. రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై 5 రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. చిత్రబృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు.