YSRTP అధ్యక్షురాలు షర్మిల(Sharmila) ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఛలో పార్లమెంట్‌కు ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కానీ ఆమె ర్యాలీకి సిద్ధమవ్వడంతో జంతర్ మంతర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కాగా కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని కొంతకాలంనగా షర్మిల డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పెద్దలను కూడా కలిసి దీనిపై ఫిర్యాదుచేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై విచారణ చేపట్టాలని ఢిల్లీ వెళ్లి సీబీఐకి కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
Read Also: హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం
Follow us on: Youtube Instagram