మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ పరువు తీశారటూ మండిపడ్డారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. జగన్‌కు వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు. అదే అదానీ సంస్థ యూనిట్ విద్యుత్‌ను పక్క రాష్ట్రాలకు ఒక రూపాయి 99 పైసలకు అగ్రిమెంట్లు చేసుకుంటే..ఒక్క ఏపీలో మాత్రం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందాలు చేసుకున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. దీని వల్ల దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని చెప్పారు. ఇది ఏపీ ప్రజలను మోసం చేయడం కాదా అని షర్మిల ప్రశ్నించారు.