వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఈరోజు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ధర్నా అనంతరం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కార్యకర్తలతో భారీర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తామన్నారు. కేసీఆర్ చేస్తున్న అవినీతి గురించి కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా తెలుసని షర్మిల అన్నారు.
Read Also: ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ రావడం మర్చిపోలేని జ్ఞాపకం: బండి సంజయ్
Follow us on: Youtube Instagram