తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి YSRTP అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగ అంశంపై ఉమ్మడి పోరాటం చేద్దామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఆమె స్వయంగా ఫోన్ చేశారు. సీఎం కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని..కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని షర్మిల కోరారు. ఉమ్మడి పోరాటానికి మద్దతు తెలిపిన సంజయ్(Bandi Sanjay) త్వరలో సమావేశం అవుదామని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
Read Also: జూనియర్ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘పండగే పండుగ’
Follow us on: Youtube, Instagram, Google News