మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. ఆస్తులు తిరిగి ఇవ్వాలంటూ చెల్లెలు షర్మిలకు లేఖ రాశారు జగన్. అయితే జగన్ రాసిన లేఖకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఉమ్మడి ఆస్తుల్లో తన నలుగురు మనవళ్లకు సమాన వాటాలు దక్కాలన్నదే తన తండ్రి వైఎస్ఆర్ ఆకాంక్ష అని ఆమె గుర్తు చేశారు. తండ్రి వైఎస్సార్ ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటుంటే జగన్ మాత్రం ఆస్తులపై కన్నేశారని మండిపడ్డారు. అయితే తన కుటుంబ సమస్యలపై స్పందించారు వైసీపీ అధినేత జగన్. కుటుంబ కలహాలు అందరి ఇళ్లలో ఉండేవేనన్నారు. షర్మిల లేఖతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కింది. షర్మిల లేఖను టీడీపీ విడుదల చేయడంతో రాజకీయంగా అగ్గి రాజుకుంది.