YS Bhaskar Reddy | హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సీబీఐ న్యాయమూర్తి నివాసానికి భాస్కర్‌రెడ్డిని తీసుకురానున్నారు. కాగా, ఈరోజు ఉదయం వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అనంతరం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి కడపకు తరలించిన విషయం తెలిసిందే.