స్వతంత్ర, వెబ్ డెస్క్: ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీ మౌనం ఓఆర్‌ఆర్ టెండర్‌లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ టెండర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? ప్రశ్నించారు.
టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటుని లేఖలో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటి? ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. మీకు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని బండి డిమాండ్ చేశారు.
ఎఫ్ సిఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. వచ్చిన దాన్యంలో ఏ మిల్లర్ కోత పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. ప్రతిపక్షాలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.