28.7 C
Hyderabad
Thursday, February 26, 2026
spot_img

పోటు పొడిచేసి అధికారం లాక్కోవడంలో సిద్ధహస్తుడు మీ నాన్న- జోగి రమేశ్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేశ్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన మామను… పిల్లనిచ్చిన మామను… అక్కున చేర్చుకున్న మామను… ఒక్క పోటు పొడిచేసి అధికారం లాక్కోవడంలో సిద్ధహస్తుడు మీ నాన్న అంటూ లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాడు రూ.17 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెడితే అందులో చంద్రబాబు ఎంత లేదన్నా రూ.1.70 లక్షల కోట్లయినా కొట్టేసి ఉంటాడని ఆరోపించారు. అవినీతిలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఘనుడు అని, కాకలు తీరిన మేధావి అని జోగి రమేశ్ అభివర్ణించారు. “మా నాన్న వ్యాపారం చేస్తే ఇంతకన్నా ఎక్కువే సంపాదించేవాడు అని లోకేశ్ అంటున్నాడు… చంద్రబాబు చేసింది వ్యాపారమే కదా… దీన్ని ఎవరైనా రాజకీయం అంటారా? మీ నాన్న చేసింది ముఖ్యమంత్రిగానా? మీ నాన్న సీఈవోగా చేశాడు… మొత్తం లూటీ చేసి మీ ఆస్తులు కూడబెట్టుకున్నారు. లక్షల కోట్ల రూపాయలతో మీ అవినీతి సామ్రాజ్యం విస్తరించుకుని విర్రవీగుతూ… మా నాన్న ఎలాంటి అవినీతి చేయలేదు, నేను ఏమీ చేయలేదు అంటూ చెబుతున్నారు. వీళ్లను చూస్తుంటే ఆవు దూడ సామెత గుర్తొస్తోంది. ఆవు దూడ పొలంలో మేయడానికి వెళితే, పొలం సొంతదారు వాటిని పట్టుకున్నాడట… అప్పుడు ఆవేమో దూడ మీద చెబుతుందట, దూడేమో ఆవు మీద చెబుతుందట… అలా ఉంది వీళ్ల వ్యవహారం! చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకలేడని లోకేశ్ చెబుతాడు… లోకేశ్ నోట్ల వేలు పెడితే కొరకలేడని చంద్రబాబు చెబుతాడు. ఇద్దరూ కూడా తోడు దొంగలు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్