స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాలో నవీపేట మండల కేంద్రంలో పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెంది ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. గత ఏడేళ్లుగా యువతి, యువకుడు అక్తర్ ప్రేమించుకుంటున్నారు. రీసెంట్ గా తనను పెళ్లిచేసుకుంటావా లేదా అని అడగటంతో పెళ్లికి ప్రియుడు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు బెడ్ షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.