స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానంటూ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు పనులను సీఎం జగన్ ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో పేర్ని నాని మాట్లాడుతూ మరోసారి జగన్‌తో సమావేశం అవుతానో.. లేదో అని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి ఇంత వైభవం తీసుకొస్తున్న సీఎంకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అని తెలిపారు.
వయస్సులో చిన్నవాడు అయిపోయారు.. లేదంటే జగన్‌కు పాదాభివందనం చేసి ఉండేవాడిని అని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ సమక్షంలోనే పేర్ని నాని పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడు పేర్ని కిట్టును రాజకీయ వారసుడిగా ప్రకటించేందుకే ఆయన రిటైర్ అవుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.