స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ఊహించని ఘటన జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కర్ర సాము చేస్తూ కిందపడ్డారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడంతో వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి 108 కలశాలతో శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ర సాము చేసిన ఎమ్మెల్యే కర్ర కాలికి తగిలి కిందపడిపోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తరువాత యధావిధిగా ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు.