ఏపీ సర్కారుపై వైసీపీ నేత సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ హామీల అమలుకు పవన్ కల్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా.. అంటూ నిలదీశారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు సూచించారు.