YS. Vijayamma | రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే షర్మిలను అరెస్ట్ చేసిందన్నారు వై.ఎస్. విజయమ్మ. హైదరాబాద్ చంచల్ గూడ జైల్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలను.. విజయమ్మ పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందుకే రాష్ట్ర ప్రభుత్వం షర్మిల గొంతు నొక్కాలని చూస్తోందని అన్నారు. ఆమె ఎప్పడు ఇంటినుండి బయటకి వచ్చినా.. పోలీసులు అడ్డుపడుతున్నాని మండిపడ్డారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా? అంటూ విరుచుకుపడ్డారు. ప్రశ్న పత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకే పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారని అన్నారు. బెయిల్‌పై షర్మిల బయటకు వస్తుందని… అనంతరం ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తుందని అన్నారు.