ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తప్పు జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో చికిత్స పొందుతున్న బాధితులను
ఆమన పరామర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
“టీటీడీలో ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలి. శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. టీటీడీ వీఐపీలపై కాదు.. సామాన్యులపై దృష్టి పెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి టీటీడీ క్షమాపణ చెప్పాలి”.. అని పవన్ కళ్యాణ్ అన్నారు.