26.7 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

జీవితంలో పని పరమావధి – కుటుంబం అతి ప్రాధాన్యం- ఇదీ ఆకాశ్ అంబానీ అమృత మనస్సు

మౌనంగానే ఎదగమని.. ఎదిగిన కొద్ది ఒదగమని..మహా వృక్షం చెబుతోందన్నారు ఓ సినీ కవి. ఉర్రూతలూగించిన ఈ పాటను అందరం పాడుకున్నాం. ఎన్నాళ్లుగానో ఆనందించాం. అయితే, అందులో ఏం అర్థం ఉందని ఆలోచించేవాళ్లు, ఆ మంచి బాటలో వెళ్లి, తాము గగనం అంత ఎదిగినవారు, ఎందరికో చేయూత ఇచ్చిన వాళ్లు..ఎందరెందరి కళ్లల్లో వెలుగులు నింపిన వారు ఉంటారు. అదే ఉత్తమ పంథాలో సాగుతున్నవారు ఉంటారు. ఈ పాట మాట అలా ఉంచితే, ఈ తరహా ఉత్తమ కోవకు చెందిన ఎందరో గొప్పవారు మనకు కనిపిస్తూంటారు. ఈ కోవకు చెందిన వారిలో వ్యాపార దిగ్గజ్జాల్లో అగ్రగామి దిగ్గజంగా అంబానీ కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. సామాన్య స్థాయి నుంచి అనన్య సామాన్య స్థాయికి ధీరూభాయ్ అంబాని..తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేయగా… దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరేలా ఆయన తనయుడు ముకేష్ అంబానీ తన వ్యాపార పటిమను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. కాస్తంత సొమ్ము చేతికి చేరితే.. కళ్లు నెత్తి మీదకు వచ్చి.. అధికార దర్పం ప్రదర్శించేవారు, కుటుంబ సంబంధాలకు తిలోదకాలిచ్చేవారు, ఆకర్షణలకు లోనయ్యేవారు, పెద్దలపై ఛీత్కారాలు చూపించేవారు మానవ సంఘంలో ఎందరో కనిపిస్తారు. అయితే, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై తన అవ్యాజ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ప్రదర్శించి, అందరి కళ్లనుంచి ఆనందబాష్పాలు రాల్చేలా చేసింది ఎవరో తెలుసా…? ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలోనే అగ్రభాగంగా, దేశ వ్యాపార సామ్రాజ్యంలో నెంబర్ వన్ గా ఉన్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తనయుడు…రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ.

ధీరూభాయ్, కోకిల, ముకేష్, నీతా, ఆకాశ్, అనంత్, శ్లొక, ఈశ… ఓహ్..అన్ని ప్రకృతి, గగనం, దైవం, ధైర్యం, నవనీత మనస్కం, సుభాషితాలకు సంబంధించిన పేర్లే. కష్టాలను ఇష్టాలుగా చేసుకుని, ప్రజాభిష్టాలకు అనుగుణంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ది చేస్తున్న ముకేష్ అంబానీ ముద్దుల తనయుడు ఆకాశ్.. తమ కుటుంబ సంబంధ, బాంధవ్యాల గురించి తెలియజేసిన అద్భుత విషయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా, అనుసరణీయంగా అనిపిస్తున్నాయి. తమ సర్వస్వం ధారపోసి, కని, పెంచి, పెద్ద చేసిన తల్లితండ్రులు రెక్కలు అలసిన స్థితిలో ఉంటే.. రెక్కలొచ్చాయి కదాని రివ్వున ఎగిరిపోయే పుత్ర సంతానంతో పుణ్య భారతావని పునీతం నుంచి పాపమయంగా మారిపోతోంది. కట్టు బట్టలతో కన్న తల్లిదండ్రులు, అత్తమామలను బయటకు గెంటి..తాము సుఖ సౌక్యాల్లో తేలియాడుతూ.. అదే ప్రపంచమని భావించే వ్యక్తుల సంఖ్య దినదిన ప్రవర్థమానంగా పెరగడం ఎంత శోచనీయం.

ఓ అభాగ్యుడు, సామాన్యుడు, చిరుద్యోగి, ఆ చిరుద్యోగి సహధర్మచారిణి…తమ పిల్లలకు ఏ లోటు రాకుండా రాజకుమారుల్లా పెంచి పెద్ద చేసి, పెద్ద పెద్ద చదువులు చదివించి, ఉన్నత కొలువులు పొందేలా చేసి.. ఎంతో మురిసిపోవడం, ఆ మురిపం మూన్నాళ్ల ముచ్చట అవ్వడం మనం చూస్తున్నాం. తమ బిడ్డల కోసం అర్థాకలితో అలమటించిన రోజులు, పస్తులున్న రోజులు, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు.. ఇలా ఎన్నో రోజులు ఆ వృద్ధ దంపతుల జీవితకాలంలో ఉంటున్నాయి. ఎన్నో రీతుల్లో అవస్థలు పడి బిడ్డలను అపురూపంగా పెంచితే, ఇంకా అడ్డాళ్లనాటి బిడ్డలే అనే భావనలో ఆ ముసలి తల్లిదండ్రులు ఉంటే….ఆ వృద్దాప్య వయస్సులో సాపాటు కు సైతం నోచుకోక, నిరాశ్రయులుగా రోడ్డుపాలయ్యే ఘటనలు ఎన్నో కన్పిస్తున్నాయి. అనుబంధం, అప్యాయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికి మనుషులు ఆడుకునే నాటకం అని నిరూపించేస్తున్నారు.

ఓ మధ్యతరగతి ఉద్యోగి దంపతులు తమ బిడ్డను గొప్పవాడిని చేయాలని.. తమ కష్టాలు తమ బిడ్డలకు రాకూడదని..కాస్ట్లీ సమాజంలో తమ బిడ్డను పెంచాలని ఆహోరాత్రులు ఎన్నో కష్టనష్టాల కోర్చారు. తాహతుకు మించిన ప్రదేశంలో…కాస్ట్లీ గ్రూప్ ఉండే చోట ఇల్లు తీసుకున్నారు, బడా బడా నేతల పిల్లలు చదివే స్కూల్లో… అప్పులు చేసి తమ బిడ్డను చేర్పించారు. పెద్ద తరహా పీపుల్ కలిగి ఉండే కారును కొని పిల్లవాని కళ్లల్లో వెలుగులు చూడాలనుకున్నారు. అయితే, ఆ సుపుత్రుడు చెప్పింది ఏమిటో తెలుసా… కొన్నారు ఓ డొక్కు కారు, చెత్త ఇల్లు.. అదే తన స్నేహితుల తల్లిదండ్రులు రోజుకో కారు మార్చగలరు. పూటకో ఇల్లు కొనగలరు. ఇదేదో పెద్ద గొప్పగా చెబుతున్నారు.. అని ఆ తనయుడు బదులిచ్చాడు. ఇలాంటి దురదృష్ట ఘటనలు సమాజంలో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.

మరి, ఆకాశ్ అంబానీ.. కోటాను కోట్ల రూపాయలకు వారసుడు, ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్త కుమారుడు, భోగలాలసాల్లో తేలియడుతూ విలాసవంత జీవితం గడపడానికి అన్ని విధాలా అవకాశం ఉన్నవాడు… రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ గా ప్రకాశిస్తున్నవాడు.. వ్యాపార సామ్రాజ్యంలో ఆకాశం అంత ఎత్తు ఎదిగిన వాడు.. తాను ఏం కోరుకున్నాడు.. కుటుంబ సౌక్యం కోరుకున్నాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందోత్సాహాలతో కలిసి ఉండాలని కాంక్షించాడు. తండ్రి పడే కష్టాన్ని వివరించాడు. తల్లి అభిరుచి, తన అభిరుచి ఒకటే అని పొంగి పోయాడు. నారీలోకంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. అనుకూలవతి అయిన భార్య రావడం తన అదృష్టం అని ఆనందం వ్యక్తం చేశాడు. బంధు, మిత్ర, కుటుంబ సభ్యులపై ఆప్యాయతానురాగాలు కురిపించి.. ఆకాశమంత కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఆకాశ్ అంబానీ తమ కుటుంబ సభ్యులపై కురిపించిన ప్రశంసల జల్లులు ఇవే.

పరిచయం అవసరం లేని వ్యాపారాగ్రగణ్య చక్రవర్తి ముకేష్ అంబాని నిరాడంబరత, నిస్వార్థ సేవ, నిబద్ధత, నిజాయితీ, నిక్కచ్చి సేవలను ఆయన తనయుడు ఆకాశ్ అంబానీ వివరించారు. తన తండ్రి పనితీరు తనకెంతో స్ఫూర్తి అని ఆకాశ్ తెలిపారు. క్షణం తీరిక లేకపోయినా, ఆయనకి వచ్చిన అన్ని మెయిల్స్ కు సమాధానం ఇస్తారని తెలిపారు. ఇందుకోసం అర్థరాత్రి రెండు గంటల వరకు మేల్కొని ఉంటారన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రిలయన్స్ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన బాటలోనే తాను సాగుతానని చెప్పారు. ఇది 45 వ ఏడాది. ఆయన పనితీరే నాకు అత్యంత స్ఫూర్తి..అని ఆకాశ్ ముంబాయి టెక్ వీక్ ఈవెంట్ లో తన తండ్రి గురించి వెల్లడించారు. అమ్మ సైతం అంతే.. తన తల్లి విశేష కృషిని ఆకాశ్ వివరించారు. అమ్మకు, తనకు క్రికెట్ ఇష్టమని, టీవీలో క్రికెట్ మ్యాచ్ లు చూస్తామని ఆయన తెలిపారు. అయితే, అమ్మ.. చిన్న చిన్న విషయాలను సైతం ఎంతో సునిశితంగా గమనిస్తుందని, ఇది తనకు ఎంతో ఆశ్చర్యం కల్గిస్తుందని తెలిపారు. తన తల్లిదండ్రుల్లో అంకితభావం తనకు అమితి స్ఫూర్తి కల్గిస్తుందని ఆయన చెప్పారు. తన కుటుంబమే తనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేర్పిందన్నారు. జీవితంలో పని, కుటుంబం, తనకు అతి పెద్ద ప్రాధాన్యాలని, ప్రతి ఒక్కరూ తన ప్రాధాన్యాలు తెలుసుకోవడం ముఖ్యమని ఆకాశ్ అన్నారు. ఒక ఉద్యోగి ఆఫీసులో పనిచేసే గంటల సంఖ్యను తాను చూడనని, రోజువారీ పని నాణ్యతే తనకు ముఖ్యమని వివరించారు.

తాను, ఈశా కవల పిల్లలం అని, అందుకే తమ మధ్య క్లోజ్ నెస్ ఎక్కువని ఆకాశ్ చెప్పారు. తామందరం కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆకాశ్ చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలని, వారితో గడిపేందుకే ఎప్పుడూ తన మనస్సు ఉవ్విళూరుతుందని తెలిపారు. శ్లోక తన భార్యగా రావడం అదృష్టం అని, ఆమె తనను ఎంతగానో అర్థం చేసుకుంటుందని వివరిచారు. గత ఏడాది అంబానీస్ గృహంలో వరుస వేడుకలు జరిగిన విషయం విదితమే. అప్పుడు వ్యాపార కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇచ్చి కుటుంబ సభ్యులందరూ సంతోష సంబరాల్లో తేలియాడారు. కృత్రిమ మేధపై ముందుకు వెళ్లేందుకు వెయ్యిమంది డేటా సైంటిస్ట్ లు, రీసెర్చర్లు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని కంపెనీ ఏర్పాటు చేసిందని టెక్ వీక్ ఈవెంట్ లో ఆకాశ్ వెల్లడించారు. దేశ ఏఐ ప్రయాణంలో భాగమయ్యేందుకు జామ్ నగర్ లో వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు తెలిపారు. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, జీపీయూ అందించేందుకు కంపెనీ యోచిస్తోందని ఆయన తెలిపారు. త్వరలో క్లౌడ్ పర్సనల్ కంప్యూటర్ తీసుకొస్తామని చెప్పారు. జియో బ్రెయిన్ పేరుతో ఏఐ సూట్ ను ప్రారంభించే ఉద్దేశం తమకు ఉందని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్