గోరంట్ల మాధవ్, పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి ఏపీ హెం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమిలో ఎలాంటి అంతర్యుద్ధం లేదన్నారు. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరు అన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడతాము అంటే కూదరదని తేల్చి చెప్పారు.
“నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడదాము అని అనుకోవడానికి ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ.. సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడేవిధంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము.. నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది.. అనుకుంటే కుదరదు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీయే ప్రభుత్వం. తప్పు చేసిన వారికి శిక్ష ఒకలాగే ఉంటుంది. నోటికొచ్చినట్టు రెచ్చగొట్టేలా మాట్లాడతాము.. దానికి ఏమీ సంబంధం లేదు .. మీరు ఏమీ చేయలేరు .. అంటే ఊరుకోము. లీగల్‌గానే ప్రొసీడ్ అవుతాము”.. అని అనిత అన్నారు.
ఈనెల 5న విచారణకు హాజరుకావాలంటూ విజయవాడ పోలీసులు రెండు రోజుల క్రితం అనంతపురంలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుందంటూ కామెంట్ చేశారు. అతి త్వరలోనే కూటమి పెడుతున్న అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు .. రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదని అన్నారు.