మహిళలు పరిశ్రమల్లో, వ్యాపారాల్లో రాణించాలని అన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని అన్నారామె. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లా, మండల కేంద్రాల్లోనూ మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించేలా అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు ఇప్పటికే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని.. త్వరలోనే 150 బస్సులను లేడీస్ కోసం కేటాయించబోతున్నామని వెల్లడించారు మంత్రి సీతక్క.